శృంగారం... ఈ మాటను బహిరంగంగా వింటే చాలు భారతీయులు ముడుచుకుపోతారు. ఇప్పటికీ దీని గురించి నాలుగ్గోడల మధ్య తప్ప చర్చించే సాహసం చేయరు. కానీ, సగం మందికి పైగా భారతీయులు శృంగారం విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పురుషుల్లో 50 శాతం మందికి అంగస్తంభన ఓ పెద్ద సమస్య. 60 శాతం మహిళలకు తమ భాగస్వామి అంగప్రవేశం సరిగా లేదన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది.
40 ఏళ్లు దాటిన పురుషుల్లో మూడింట రెండొంతుల మంది పురుషపుంగవులు అంగప్రవేశ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు ఏషియా పసిఫిక్ సెక్సువల్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ స్టడీ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో శృంగారం గురించి మాట్లాడటం కూడా చాలా తక్కువేనని ఈ సర్వే చెబుతోంది. జీవితంలో 17 అంశాల్లో శృంగారానికి పురుషులు ఏడోస్థానం ఇస్తే.. మహిళలు 14వ స్థానం ఇచ్చారట.
ముడుచుకు పోతే ఇంతే...
2,500 సంవత్సరాల క్రితమే కామశాస్త్రాన్ని రాసిన వాత్సాయనుడు పుట్టిన గడ్డపై ఈ ఆధునిక కాలంలోనూ శృంగారం గురించి బయటకు మాట్లాడితే తప్పుగా భావించే పరిస్థితులు ఉన్నాయి. భారతీయ స్త్రీపురుషులు ఏం కోల్పోతున్నది కూడా అర్థం అవుతోంది కదూ...
జీవిత భాగస్వామిగా ఉండటం, ఉద్యోగం, తల్లి/తండ్రి హోదా, ఆర్థికంగా స్థిరపడటం, ఆరోగ్యం వంటివి మిగిలిన ప్రాధాన్యాల్లో ఉన్నాయి. జీవితంలో పూర్తిస్థాయిలో సంతోషంగా ఉండాలంటే శృంగార మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఈ సర్వే తేల్చిచెప్పింది. దీనికి కూడా వారు తమ సర్వే ఫలితాలనే ప్రామాణికంగా చెబుతున్నారు.
శృంగార జీవితాన్ని హాయిగా ఆస్వాదించేవారిలో 87 శాతం మంది మిగిలిన జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్లు చెబుతుండగా, అక్కడ ఇబ్బంది పడేవారికి జీవితంలో మిగిలిన అంశాలన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చెందిన ఆండ్రాలజిస్టు రూపిన్ షా చెప్పారు.
తాము పట్టణప్రాంతాల్లో మాత్రమే సర్వే చేసినా, గ్రామీణ భారతం కూడా అచ్చంగా ఇదేవిధమైన సమస్యతో బాధపడుతోందని ఆయన వివరించారు. మగవాళ్లు శృంగారానికి జీవితంలో చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, మహిళలు మాత్రం దానికి అత్యంత తక్కువ ప్రాధాన్యమిస్తున్నారట.
నీలిచిత్రాలే మందు
శృంగార పరమైన సమస్యలకు చాలామంది దంపతులు నీలిచిత్రాలనే మందుగా భావిస్తున్నారట. ఈ విషయం మరో సర్వేలో తేలింది. అయితే, అటు మగువలు ఇటు మగవారు కూడా వీటిని విడివిడిగానే చూస్తున్నారు తప్ప కలిసి చూసే సందర్భాలు కాస్త అరుదుగా ఉంటున్నాయి. కలిసి చూసేవారిలో కొందరు కేవలం కొన్ని హాట్ సీన్లుండే హాలీవుడ్ చిత్రాలను చూస్తుంటే ఈ అలవాటు బాగా ఉన్నవారు మాత్రం త్రిబుల్ ఎక్స్ రేటింగ్ ఉన్న నీలిచిత్రాల వైపు కూడా మొగ్గుతున్నారు.
సమస్యలున్న దంపతులకు ఇవి ఉత్ర్పేరకాలుగా ఉపయోగపడుతున్నాయన్నది వైద్యవర్గాల భావన. దాంపత్య జీవితంలో నీలిచిత్రాలు చూడటం నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్నకు సమాధానం అటూ ఇటూగా వచ్చింది. 53 శాతంమంది అది సర్వసాధారణమేనని భావిస్తే, 43 శాతం మంది సరికాదన్నారు. మిగిలినవారు ఎటూ తేల్చుకోలేకపోయారు. నీలిచిత్రాలు చూస్తున్న మగవారు తమ భాగస్వామి కూడా అందులో చూపించిన అందాల భామలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం అవసరమైతే కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవాల్సిందిగా కూడా వారు తమ భార్యలను అడుగుతున్నారు. కానీ, పరస్పర అంగీకారంతో చూస్తేనే ఇవి ఫలితాన్నిస్తాయని డాక్టర్ సమీర్ పరేఖ్ అనే మానసిక వైద్యనిపుణుడు పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న ఓ మహిళ ఇలా స్పందించారు- ‘శృంగార జీవితాన్ని మరింత ఆస్వాదించడానికి నీలిచిత్రాలు సరైనవి కావు. మానసిక ఒత్తిడి దూరమవడానికి సాధనం మాత్రమే’ అని ఆమె అన్నారు.

We(want) Fuck&Suck - to*you */RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com
ReplyDelete