హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Monday, 17 November 2014


44. దంపతుల మధ్య ప్రేమ సజీవంగా ఉండాలంటే..!!



దశాబ్దాల తరబడి రొమాన్స్ సాగించిన తర్వాత కూడా దంపతుల మధ్య ప్రేమ, సరససల్లాపాలు సజీవంగా ఇంకా సజీవంగా ఉంటున్నాయా అనేది ప్రస్తుతం తలెత్తున్న సమస్య. ఎందుకంటే మనిషి జీవితం యాంత్రికమై పోయింది. నిద్రలేచింది మొదలుకుని రాత్రి పడుకునేంత వరకు ఉరుకులు.. పరుగులు మినహా ప్రశాంత జీవనం సాగిస్తున్న సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.

రోజంతా పోటీ ప్రపంచంతో పోటీ పడి పరుగెత్తి రాత్రి ఇంటికి వచ్చే సమయానికి బాగా అలసి పోయి రావడం సహజం. దీంతో దంపతుల మధ్య రొమాన్స్, ప్రేమలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని అనేక సర్వేలు చెపుతున్న నిజం.

అయితే, ఏళ్ల తరబడి సంసారం జీవనం సాగించిన తర్వాత కూడా దంపతులు పరస్పరం ప్రేమను, రోమాన్స్‌ను ఓ అలవాటుగా కాకుండా సజీవంగా ఉంచుకోవాల్సిన ఎంతైన ఉందని అంతర్జాతీయ సెక్స్‌నిపుణులు, సైకాలజిస్టులు చెపుతున్నారు. ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తల తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.

ప్రేమను కాపాడుకోవాలని చైతన్యపూరితమైన నిర్ణయం తీసుకోవాలట. మీ భాగస్వామి పట్ల మిమ్మల్ని ఆకర్షితులను చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టి, ఆమెకు లేదా ఆయనకు ఇష్టమైన రెస్టారెంట్లు, ఇతరాత్రా ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా దంపతుల మధ్య రోమాన్స్‌ను సజీవంగా ఉంచుకోవచ్చట.

అంతేకాకుండా, ఇద్దరూ కలిసి చేయాల్సిన పనులపై ముందుగానే ఒక కార్యాచరణ రూపొందించుకుని వాటిని పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజుల పాటు తమతమ కొలువులకు సెలవు పెట్టి కలిసి చేస్తే ఎంతో మంచిది. ఈ సెలవుల్లో తమకు ఇష్టమైన ప్రదేశాలు, ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మరీ మంచిదని చెపుతున్నారు.

అలాగే, తమ భవిష్యత్ కోసం ప్రణాళికలను వెంటనే పూర్తి చేయడం మొదలు పెట్టాలి. మీ భాగస్వామికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పించవచ్చు. మీ భాగస్వామి ధరించే దుస్తుల పట్ల ఇష్టాన్ని ప్రదర్శించవచ్చు.

శారీరకంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయండి. దుస్తులు ధరించడం మీ భాగస్వామికి ఇష్టమయ్యేలా ఉండాలి. వెంటనే ఇది ఫలితం చూపకపోయినా దీర్ఘకాలంలో ఫలితం ఇస్తుంది. ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో కాస్త జాగ్రత్త వహించినట్టయితే.. దంపతుల మధ్య ప్రేమ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment